ముస్లిం మైనారిటీలకు లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది - మంత్రి ఉత్తమ్

ముస్లిం మైనారిటీలకు లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది - మంత్రి ఉత్తమ్

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని , వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . మంగళవారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు . కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని CAA ను , NRC  నేషనల్ రిజిస్టార్ ఆఫ్ ఇండియా ను తెలంగాణా లో కాంగ్రేస్ ప్రభుత్వం అనుమతించభోదని ఆయన అన్నారు . కాంగ్రేస్ ప్రభుత్వం లౌకిక వాదాన్ని సమర్థిస్తుందని , దేశంలో అన్ని మతాలను , కులాలను సమానంగా చూస్తుందని అన్నారు.

దేశంలో లౌకిక పాలన్ రావాలంటే దేశ ప్రజలందరూ ముఖ్యంగా ముస్లిం సోదరులు రాహుల్ గాంధీ ని ప్రధానిని చెయ్యడానికి సహకరించాలని కోరారు . తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు . కోదాడ లో ముస్లింల కోసం 3 కోట్ల రూపాయలతో షాదీఖానా , 2 కోట్ల రూపాయలతో ఈద్గా ను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు . ముస్లిం కుటుంబాలకు అల్లా దయతో అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంఏ జబ్బార్ , కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల , మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు , మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు , టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి , వంగవీటి రామారావు , బషీర్ , చింతలపాటి శ్రీను , పారా సీతయ్య , బుర్రా పుల్లారెడ్డి , సామినేని రమేష్ , మునావర్ , ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు .