సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
  • ఉద్యమకారుడైన డాక్టర్ పిడమర్తి రవికి కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి
  • లేనిపక్షంలో మాదిగలను చైతన్యం చేసి మా వాటా కోసం పోరాడుతాం
  • తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు..మీసాల రామన్న మాదిగ

ముద్ర.వీపనగండ్ల:- కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తుందని, మాదిగలందరు చైతన్య కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ అన్నారు.ఈ సందర్భంగా మీసాల రామన్న మాదిగ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి, రెండు పార్లమెంటు స్థానాలను మాదిగలకు కేటాయించి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ తెలంగాణ ఉద్యమకారుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేశారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటే, అందులో 3 ఎస్సీ రిజర్వుడు స్థానాలు.

జనాభా ధమాషా ప్రకారం మాదిగలకు 2 పార్లమెంటు స్థానాలు రావాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఒక్క పార్లమెంటు సీటు కూడా కేటాయించలేదు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటులో ఉండే మాదిగలను చైతన్యం చేస్తూ, రెండు పార్లమెంట్ స్థానాలు సాధించేవరకు ఉద్యమాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ దండోరా మాలలకు వ్యతిరేకం కాదని, మల్లు రవికి వ్యతిరేకం కాదని జనాభా దమాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన వాటా అడుగుతున్నామని ఆయన అన్నారు. మాలలు కూడా మాదిగలకు మద్దతుగా ఉన్నారని  తెలిపారు. త్వరలో అన్ని మాదిగ సంఘాల నాయకులతో కలిసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.