విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. మెదక్ లో వడ్డించిన ఎమ్మెల్యే పద్మ, కలెక్టర్ షా

విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. మెదక్ లో వడ్డించిన ఎమ్మెల్యే పద్మ, కలెక్టర్ షా

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్రంలో మొదటిసారిగా సీఎం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహార పథకం) స్కీంను మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అల్పాహార పథకం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయంతో పాటు ఇరిగేషన్, విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, డిఈఓ ప్రొ. రాధాకిషన్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ నీలకంఠం, హెచ్ఎం పొద్దార్ రేఖ, సీడీపీఓ స్వరూప, డిఎస్ఓ రాజిరెడ్డి, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, జయరాజు, మాజీ వీసీ రాగి అశోక్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి రాజగోపాల్ గౌడ్, నాయకులు గడ్డమీది కృష్ణా గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు.