1000 కోట్లతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేశాం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

1000 కోట్లతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేశాం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణాన్ని రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేశామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ వివేకానంద మిని స్టేడియం, ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రి కాలేజీ గ్రౌండ్,రోటరీ పార్క్, ధరూర్ క్యాంప్ లలో వాకర్ లను,వాకర్ అసోసియేషన్ సభ్యులను,యువకులను ఎమ్మెల్యే కలిసి ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అలాగే జగిత్యాల పట్టణంలోని మిషన్ కౌంపౌండ్ సిఎస్ ఐ  చర్చ్, థరూర్ క్యాంపు క్రిస్ట్ చర్చ్, గోవింద్ పల్లి ఏసురక్తం చర్చి, టి ఆర్ నగర్ చర్చి లలో ప్రత్యేక ప్రార్థనలు  చేసి బిఆర్ ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధి కి 25 కోట్లు, మహిళ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం 5 కోట్లు  నిదులు మంజూరు చేసి ఓపెన్ జిమ్, రన్నింగ్ ట్రాక్ సైతం ఏర్పాటు చేయడంతో నేడు ఎంతో మందికి ఉపయోగంగా మారిందన్నారు. జగిత్యాల నలు వైపులా పార్కుల అభివృద్ధి చేసి. 18 చోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో బీద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగంగ మారిందన్నారు. జగిత్యాల పట్టణం లో అన్ని ఆలయాలకు, మజీద్ ,చర్చి ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ లు కూతురు రాజేష్,కోలాగాని ప్రేమలత సత్యం, వొద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, కుసరీ అనిల్,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్,నాయకులు బాలే శంకర్,మహేష్,విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.