సింగిల్ విండో అధ్యక్షుడి జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే

సింగిల్ విండో అధ్యక్షుడి జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే

ముద్ర, మల్యాల: మండలంలోని నూకపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు బోయిన్పల్లి మధుసూదన్ రావు జన్మదిన వేడుకలు మల్యాల క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై, కేక్ కట్ చేయించారు. అనంతరం మధుసూదన్ రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పి కో అప్షన్ మెంబర్ ఎండీ సుభాన్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, మల్యాల సింగిల్ విండో అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, కొండగట్టు డైరెక్టర్లు జున్ను సురేందర్, కొంక నర్షయ్య, గంగన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.