తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈనెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో  హైదరాబాద్​, రంగారెడ్డి, -మహబూబ్‌నగర్‌ ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్‌ జరుగుతోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.