ఈ -సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఈ -సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
  • రూ.3లక్షల విలువ చేసే సిగరెట్టు
  • రెండు సెల్​ ఫోన్లు స్వాధీనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యార్థులే లక్ష్యంగా  నిషేధిత – ఈ -సిగరెట్లను విక్రయిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే –ఈ -సిగరెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మాధవ్ అనే వ్యక్తి కోల్‌కతా, ముంబయి నుంచి కొరియర్ ద్వారా – ఈ -సిగరెట్లను తెప్పిస్తున్నాడు. 63 మంది కళాశాల విద్యార్థులకు ఈ సిగరెట్లు విక్రయిస్తున్నాడు. పంజాగుట్టలోని అమిటీ కళాశాల, శంకర్ పల్లిలోని ఇక్ఫాయ్, ఐబీఎస్, బాచుపల్లిలోని మహీంద్ర విశ్వవిద్యాలయం, కొండాపూర్‌లోని సంక్రీత్ కళాశాల, షేక్ పేట్‌లోని ఆకర్ష్ ఇనిస్టిట్యూట్, పటాన్‌ చెరులోని గీతం కళాశాలలోని కొంతమంది విద్యార్థులకు మాధవ్ –ఈ- సిగరెట్లను సరఫరా చేస్తున్నాడు. అమిటీ కళాశాలకు చెందిన అచ్యుత గౌతమ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఈ- సిగరెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 71 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గౌతమ్ -సిగరెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్దారించారు. అరెస్టు చేసిన వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు రాయదుర్గం పోలీసులు విచారణ చేపట్టారు.