తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

ముద్ర,తెలంగాణ బ్యూరో: గోల్డ్ రేటు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా బంగారం ధర పెరుగుతుంది. అయితే, గురువారం బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 330 తగగ్గా.. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 300 తగ్గింది. దీంతో గత కొద్దిరోజులగా గోల్డ్ ధర పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్న బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరను పరిశీలిస్తే.. గురువారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,650 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,800 వద్దకు చేరింది.