మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ 

మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ 

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల తీరుతెన్నులను ట్రైనీ ఐఏఎస్ అగస్త్య అభినవ్ గురువారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఈ- నామ్ విధానం అమలు చేస్తూ ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు పొందిన కేసముద్రం మార్కెట్ పనితీరును ట్రైనీ ఐఏఎస్ పరిశీలించారు. రైతు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయించి నగదు పొందేంతవరకు జరుగుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ గేట్ ఎంట్రీ, లాట్ ఐడి క్రియేషన్, ఈ టెండరింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ వేయింగ్ సిస్టం పనితీరును ట్రైనీ ఐఏఎస్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమరలింగేశ్వరరావు, సూపర్వైజర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.