కులవృత్తులకు అభివృద్ధికి 100 కోట్లు -ఎమ్మెల్యే రాజయ్య

కులవృత్తులకు అభివృద్ధికి 100 కోట్లు -ఎమ్మెల్యే రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కులవృత్తులను అభివృద్ధి చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఈఆర్ఎల్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబరాల కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్డీవో కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. కులవృత్తుల అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించగా ఈరోజు 50 మందికి చెక్కులు అందించినట్లు తెలిపారు.

జీవో నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు. జూలై నెలలో గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3 వేల ఇండ్లకు మంజూరి ఉన్నట్లు తెలిపారు. బి కింద గొల్ల కురుమలకు యూనిట్లు ఇచ్చామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రెండున్నర లక్షల ప్రోత్సాహక బహుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఊర్వలేని బిజెపి అప్పులు పుట్టకుండా చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు.

దేశం గర్వించే పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఏసీపి రఘు చందర్, జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పిటిసి మారపాక రవి, ఎంపీపీలు కందుల రేఖ, చిట్ల జయశ్రీ, ఎంపీటీసీ దయాకర్, సీఐ రాఘవేందర్, స్థానిక సర్పంచ్ సురేష్, ఏపిఎం కవిత, డిపిఎం, సిడిపిఓ తదితరులు పాల్గొన్నారు.