పాలడుగు గ్రామవాసికి  మహానంది పురష్కారం .

పాలడుగు గ్రామవాసికి  మహానంది పురష్కారం .


మోత్కూర్(ముద్ర న్యూస్):  మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన గుంటోజు శేఖర్, జానకి ల ద్వితీయ కుమారుడు రాంబట్ల పార్థసారథి శర్మ కు శనివారం హైదరాబాదులోని త్యాగరాయగాన సభలో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ నెల్లూరు జిల్లా కావలి వారు జాతీయస్థాయిలో మహానంది పురస్కారాన్ని అందజేశారు. తెలుగు సంస్కృతి పౌరోహిత్య రంగంలో ఈ అవార్డును అందజేసినట్లు కార్యక్రమ ముఖ్య అతిథి వారణాసి నాగేశ్వర చారి, ప్రముఖ రచయిత్రి సూరేపల్లి విజయ, ఆ సంస్థ సలహాదారు మానేపల్లి నరసింహచార్యులు తెలిపారు. పార్థసారథి శర్మ యాదగిరిగుట్టలోని సంస్కృత విద్యాపీఠంలో నాలుగేళ్ల పాటు పౌరోహిత్యంలో శిక్షణపొందినట్లు ఆయన తండ్రి గుంటోజు  శేఖర్ తెలిపారు. హైదరాబాదులోని  మల్కపేట లో పౌరోహిత్యం చేస్తున్నట్లు వివరించారు. ఆయనకు ఈ అవార్డు లభించడం పట్ల పాలడుగు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.