ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం....

ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం....

ప్రభుత్వాన్ని నిలదీసిన అఖిలపక్ష కమిటీ నేతలు....

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శులు రాచకొండ జనార్ధన్. మామిడాల బిక్షపతి తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యే గొంగిడిని ప్రశ్నించారు.

మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల ముందు ఆలేరును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ప్రకటించినప్పటికీ నేటి వరకు కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని అన్నారు. ఇటీవల అనేక ప్రాంతాలను డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

ప్రజల ఆశలకు అనుకూలంగా ఎమ్మెల్యే నడుచుకోవాలని హితువు పలికారు. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు కొద్దో గొప్పో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం పై భర్తీకి తీసుకువచ్చి ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికలలో నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు. అఖిలపక్ష కమిటీ నేతలు. తదితరులు పాల్గొన్నారు.