ఎమ్మెల్సీ తిరస్కరణ అంశం పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

ఎమ్మెల్సీ తిరస్కరణ అంశం పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకుంది
  • గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు
  • ప్రకటన తరవాత రాజీనామా చేసిన గవర్నర్  ..నేడు నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకుంటా అనడం సరైనది కాదు 
  • బీజేపీ నుండి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు
  • గవర్నర్ తీరు గురువింద తీరుని తలపిస్తుంది
  • గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుంది
  • తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ కి అర్హురాలు కాకుండాపోతుంది
  • నీతులు చెప్పే గవర్నర్
  • నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నాం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఎమ్మెల్సీల  తిరస్కరణ పై గవర్నర్ తమిల్ సై చెబుతున్న సాకులు గురువింద సామేత ను గుర్తుకు తెస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి, ఎమ్మెల్సీ ల విషయం తప్పుడు నిర్ణయం తీసుకున్న గవర్నర్ సెల్ఫ్ గోల్ చెసుకుందని తెలిపారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బిజెపి పార్టీ కి అధ్యకురాలు గా ఉన్నారన్నారు. పదవి ప్రకటన తరువాత పదవికి రాజీనామా చేసిన గవర్నర్ అయిన తమిల్ సై నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటా అనడం అర్దరహితం అన్నారు. బిజెపి నుండి గవర్నర్ గా వచ్చిట్ ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు అన్నారు. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అడుగురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.