జిల్లా పోలీస్ కార్యాలయంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్  చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెగువతో పోరాడిన వీరోచిత యోధురాలు అని అన్నారు. ఐలమ్మకు నివాళులు అర్పించిన వారిలో  అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, పట్టణ CI రాజశేఖర్, ఆర్.ఐ నారాయణ రాజు, RSI  లు, SI లు, DPO, స్పెషల్ బ్రాంచ్, DCRB, IT  కోర్, సిబ్బంది పాల్గొన్నారు.