శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అడ్లూరి

శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అడ్లూరి

గొల్లపల్లి.ముద్ర:- గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు గ్రామంలో ఈనెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మాజీ సర్పంచులు భీమా సంతోష్, రేవెళ్ళ సత్యనారాయణ గౌడ్, పురంశెట్టి వెంకటేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్, సింగారపు కొమురయ్య, గురిజాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు నెరెళ్ళ మహేష్ తదితరులు పాల్గొన్నారు.