గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య
 ముద్ర ప్రతినిధి, జనగామ: జిల్లాలో గ్రూప్ 4 పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జనగామ కలెక్టర్‌‌ కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, ప్రపుల్ దేశాయ్‌తో కలిసి సమీక్ష నిర్వవహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం నిర్వహించే గ్రూప్ 4 పరీక్ష కోసం జిల్లాలో 29 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  29 మంది లైసెన్ ఆఫీసర్లు, 8 మంది రూట్ ఆఫీసర్లు, 29 మంది చీఫ్ సూపరింటెడెంట్లను నియమించామని తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, టేబుల్స్, విద్యుత్ తదితర మౌలిక వసతులను చెక్‌ చేసుకోవాలని సూచించారు. 

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 6303928 718 ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలు, సెంటర్ల వివరాలు హాల్ టికెట్ల వివరాల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ నంబర్‌‌లో కాల్ చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 10,654 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందులో 29 మంది బదీరులు, 202 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్‌‌ పరీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సూరి, జిల్లా అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.