కౌంటింగ్ హాల్ లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు : కలెక్టర్

కౌంటింగ్ హాల్ లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి :కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు కూర్చునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. , డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు  సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, సంబంధిత అధికారులతో కలిసి  ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్ నియోజక వార్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగుతుందని, బాన్సువాడ కు సంబంధించి నిజామాబాద్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు  చేయుటకు మార్కింగ్ చేయాలని,   ఏజెంట్లు కూర్చునే విధంగా బ్యారికేడింగ్, జాలీలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి, పంచాయత్ ;రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.  హాలు లోకి ఒక ప్రవేశ ద్వారం ఈ.వి.ఏం. లు తెచ్చే విధంగా, మరో ప్రవేశ ద్వారం    ద్వారా అధికారులు, ఏజెంట్లు, అభ్యర్థులు వచ్చే విధంగా చూడాలన్నారు.

డాట్ల లెక్కింపు వివరాలు ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేయుటకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ;గట్టి పొలిసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం ఎస్పీ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలని, ఏదేని సమాచారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ , ఎస్.ఎస్.టి. బృందాలకు తెలపాలని అన్నారు. లైసెన్స్ కలిగిని ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 125 లొకేషన్లలో గుర్తించిన సమస్యాత్మక ల్పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పొలిసు సెక్టోరల్ అధికారులు ప్రతి బుధవారం సమావేశమై పోలింగ్ బూత్ వారి రూట్ మ్యాప్  ప్రకారం రవాణా మార్గం, రహదారుల  వెంట కల్వర్టులు, బ్రిడ్జిలను   క్షుణ్ణంగా  పరిశీలించాలన్నారు. పెద్ద ఎత్తున మద్యం స్టాక్ చేసిన ప్రాంతాలను గుర్తించి స్వాధీనం  చేసుకోవాలన్నారు. ఎన్నికల వేళలో ప్రెషర్  కుక్కర్, తదితర వస్తువులు కానుకలుగా ఇచ్చే వాటిపై వాణిజ్య పన్నుల శాఖ  ఇంటలిజెన్స్ టీమ్ దృష్టి సారించాలన్నారు.  సైలెన్స్ పీరియడ్ అనగా పోలింగ్ కు రెండు రోజుల ముందు చాలా గందరగోళ పరిస్థితులుంటాయని  మాడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను చాకచక్యంగా  మానిటరింగ్  చేయవలసి ఉంటుందని అన్నారు.  ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు   బాధ్యాతాయుతంగా పనిచేసి ఎన్నికల ప్రక్రియ  సజావుగా కొనసాగేలా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో    అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు,, మైనారిటీ జిల్లా అధికారి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.