ఈ ప్రాంత బిడ్డను ఒక్కసారి ఆశీర్వదించండి

ఈ ప్రాంత బిడ్డను ఒక్కసారి ఆశీర్వదించండి
  • పక్క నియోజకవర్గం నాయకులను తరిమికొట్టండి.
  • కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు....
  • టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో అంతా అవినీతి జరిగిందని,దామోదర్ రెడ్డి, కాంగ్రెస్  హయాంలోనే నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందినాయని,సంక్షేమం వైపు కాంగ్రెస్, అవినీతి వైపు బీ ఆర్ ఎస్ ఉన్నాయని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు బుధవారం దురాజ్ పల్లి ఐదో వార్డు నుండి పఠాన్ సైదా ఖాన్ ఆధ్వర్యంలో 300 కుటుంబాల వారు బీఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజలంతా ఒకసారి ఆలోచించాలని, దూరాజ్ పల్లి గ్రామంలో నిరుపేద, అర్హులకు ఒక్కరికైన దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి వచ్చిందా,సంక్షేమ పథకాలు అన్ని మంత్రి అనుచరులు, బీ ఆర్ ఎస్ నాయకులకే ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు అందిస్తాం అని, ఆరు గ్యారెంటీ ల విషయంలో కాంగ్రెస్ వెను తిరగదు మడమతిప్పదు అని వివరించారు.

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డనని,మీ ప్రాంతవాడిని, మీ సమస్యలపై అవగాహన ఉన్నవాడిని, మీ బిడ్డగా ఒక్కసారి నన్ను సూర్యాపేట ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తా అని రమేష్ రెడ్డి వెల్లడించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి మన ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులకు ఇక్కడి ప్రజలు బై బై చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఉపాధి,  ఇండ్లు, కాలువల ద్వారా వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా నీరు లభించాయని తెలిపారు. ఎమ్మెల్యే గా దామోదర్ రెడ్డి ఉన్నపుడు, కాంగ్రెస్ హయాంలోనే సూర్యాపేట నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ అవినీతి కుంభకోణంలో మునిగిపోయి ఉందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వైపు ఉందని స్పష్టపరిచారు. సూర్యాపేట నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అన్ని మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు, బీ ఆర్ ఎస్ నాయకులకు మాత్రమే అందుతున్నాయని ఆరోపించారు. రెండెకరాల భూమి ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.   కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి గోదల రంగారెడ్డి గట్టు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు బంటు 
చోక్కయ్య గౌడ్ యాట ఉపేందర్ ఫారుక్, స్వామి నాయుడు నామా అరుణ్ తదితరులు పాల్గొన్నారు