శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం

శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం

యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీరామాచార్యులు

ముద్ర, కోరుట్ల: కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ లో గల శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీలక్ష్మీ నారాయణస్వామి దేవాలయ పంచాదశ వార్షికోత్సవ పంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మూర్తి మంత్ర హవనం రథోత్సవం సముద్రాల శ్రీరామమాచార్యుల వైదిక నిర్వహణలో నిర్వహించగా భక్తుల కోలాటాల చిన్నారుల కేరింతల మధ్య రథోత్సవం అష్టలక్ష్మి దేవాలయం నుండి ప్రారంభమై నంది చౌరస్తా మీదుగా మళ్లీ తిరిగి అష్టలక్ష్మి దేవాలయంనకు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూరుగు రామస్వామి గౌడ్ సుభద్ర దంపతులు పాల్గొన్నారు. అనంతరం బూరుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విచ్చేసిన భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన రాత్రి భోజనం ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరుట్ల పట్టణ పరిసర గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను తిలకించి, తీర్థ ప్రసాదాల అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈకార్యక్రమంలో యజ్ఞచార్యులు, సముద్రాల శ్రీరామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఇందుర్తి మధుసూదనాచారి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, శివకుమారాచార్యులు, మాధవాచార్యులు, శ్రీకాంతాచార్యులు, సిద్ధిక్ చౌటుకూరి, అంజయ్య గౌడ్, ముత్యాల గంగాధర్, వెంకటేశ్వర్ రావు, కోటగిరి మహేష్, గంగాధర్, పురుషోత్తం, చిలుక గంగాధర్, రంగు రమేష్, శ్రీనివాస్, సతీష్, భూమయ్య, చందు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.