మాక్ పోలింగ్ పై విద్యార్థుల కు అవగహన

మాక్ పోలింగ్ పై విద్యార్థుల కు అవగహన

ముద్ర ప్రతినిధి, మెదక్:హవెలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ పై అవగాహన కల్పించారు.  బుధవారం కలెక్టర్, డిఈఓ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహణ తీరుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాలలో నలుగురు విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.

అందులో అక్షయ, నందిని,  భాను ప్రసాద్,  అభిలాష్ లు పోటీలో ఉండగా వారికి గుర్తులు  కేటాయించి  ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులే ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా,  ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరించారు. 497 మంది విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈవీఎంలపై అవగాహన కల్పిస్తూ ఓటును వినియోగించుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మధుమోహన్  ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. మధుమోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఎన్నికల నిర్వహణపై పోలింగ్ పై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుభద్రయ్య, హరిత, ధన్ రాజుల  పర్యవేక్షణలో సాయంత్రం వరకు ఎన్ని కల విధానంపై అవగహన కల్పించారు. పాఠశాల. ప్రధానోపాధ్యాయులు  అభినందించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్, వనజాక్షి, శ్రీనివాస్, మల్లారెడ్డి, లక్ష్మీకాంతం, స్టెల్లా,ప్రభు, జయలక్ష్మి, చంద్రకాంత్, ఎల్లం రామానుజ, మాధవి, దేవుల, జాకీర్ హుస్సేన్, నజీర్ లు పాల్గొన్నారు.