ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:  పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు పండ్లు ఇచ్చి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ  రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, రంజాన్ పర్వదినం సందర్భంగా అడ్వాన్స్ గా ముస్లిం సోదరి, సోదరీమణులకు  శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమన్నారు.

నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. ముస్లిం సోదరులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, కొప్షన్ సభ్యులు గౌస్, నిజాం, జాకీర్, బాబర్, మహేందర్ గౌడ్, కిషన్ రెడ్డి, శివయ్య, మైనార్టీ సహోదరులు పాల్గొన్నారు.