ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: జిల్లా కేంద్రంలోని స్థానిక తహసిల్ చౌరస్తాలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిజామాాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి బిజెపి కార్యకర్తలు నక్సలైట్ లను ఎదుర్కొని పార్టీని కాపాడుకోవడం జరిగిందని, వ్యాపారాలు కుటుంబాలను త్యాగం చేసి పార్టీని 30 సం నుండి కాపాడుకుంటూ వస్తె అరవింద్ వచ్చాక జగిత్యాలలో ఉన్న సీనియర్ నాయకులను విస్మరిస్తున్నాడని అన్నారు. ఇటు బిజెపి నాయకులకు గాని,  ప్రజలకు అందుబాటులో ఉండకుండా  ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం, పరోక్షంగా పోలీస్ కేసుల పెట్టిస్తున్నారని ఆరోపించారు.

డబ్బులు ఇస్తే కూలీలు వలె కార్యకర్తలు వస్తారని అనడం అయిన అహంకారానికి నిదర్శనం అన్నారు. ఇతర పార్టీలకు అమ్ముడుపోయే వ్యక్తులకు టికెట్,  బాధ్యతలు ఇచ్చి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు, కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కి తప్ప పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీటీ శేఖర్ రావు,  ఠాకూర్ విజయ్ సింగ్, ఎడమల వెంకట్ రజం, లింగాల శ్రీకాంత్ రావు, బావేటి శ్రీనివాస్, గోగికర్ మహేందర్, గట్టపెళ్ళి జ్ఞనేశ్వర్, జైనపురం రమేష్, మావిడి శేఖర్, కసరపు శ్రీనివాస్, కట్ట విజయ్ , చుక్క అశోక్, గొడిషేల నాగరాజు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.