పెద్దపల్లి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఉంటాం

పెద్దపల్లి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఉంటాం
  • ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం - బీఎస్పీ కాంటెస్ట్ అభ్యర్థి దాసరి ఉష

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపెల్లి నియోజకవర్గం ప్రజల కోసం ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని,  బీఎస్పీ పార్టీపై నమ్మకంతో ఓటు వేసి తనను ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని,  ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు సహజమని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్చార్జి,  కాంటెస్ట్ ఎమ్మెల్యే దాసరి ఉష అన్నారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా బీఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ...

గత రెండున్నర ఏండ్ల నుండి బహుజన గొంతుకగా బీఎస్పీకి కొత్త ఆశలు రేకెత్తించిన పెద్దపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు, బీఎస్పీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, శ్రేయోభిలాషులు నిరుత్సాహ పడవద్దన్నారు, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి విజయం దిశగా సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తామన్నారు.పెద్దపల్లి ప్రాంత ప్రజలకు తాను ఇక్కడే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఋనిరంతరం పోరాడుతూ ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతామన్నారు, ఏదైతే బీఎస్పీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామీల్ల శారద, పెద్దపల్లి మాజీ జడ్పిటిసి ఈర్ల కొమురయ్య, పెద్దపల్లి జడ్పిటిసి బండారి రామ్మూర్తి, పెద్దపెల్లి పట్టణ కౌన్సిలర్లు బొంకూరి సురేందర్ సన్నీ, రాజం మహంత కృష్ణ యాదవ్, సాబీర్ ఖాన్, మాజీ కౌన్సిలర్ మర్రిపల్లి సతీష్, బీసీ సంక్షేమ సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు సిరవేన స్వప్న ముదిరాజ్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.