కరీంనగర్ లో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు

కరీంనగర్ లో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు
Vasanth Kumar is the founder of Okinawa Martial Arts Academy

ముద్ర ప్రతినిధి కరీంనగర్: స్థానిక బి. ఆర్ అంబేద్కర్ స్టేడియంలో సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు సౌజన్యంతో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ రూపకర్త వసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుడా చైర్మన్ కప్-2023 ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరాటే పోటీలో పాల్గొనడానికి ప్రోత్సాహం చూపిన విద్యార్థులను వారి తలితండ్రులను ప్రశంసించారు. పోటీలో గెలుపు, ఓటమిలు సహజం అని బరిలో నిలవడం గొప్పవిషయం అన్నారు.

తాను కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు స్మార్ట్ సిటీ కింద తెచ్చిన నిధుల తో ఈ ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందని గుర్తుచేసినారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలు తెచ్చామని, తెలంగాణ విద్యార్థులు గర్వపడేలా చేశామన్నారు. కరాటే యుద్ధ విద్యయే గాక క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు అని, గత 40 సంవత్సరాలుగా వసంత్ కుమార్ ఎంతో మందికి కరాటే విద్యను అందించి సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ పోటీలలో సుమారుగా 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. షిహాన్ సంపత్ కుమార్, కె. మొండయ్య, సీనియర్ బ్లాక్ బెల్ట్స్ ప్రదీప్ కుమార్, మన్నన్, లింగయ్య, శ్రీనివాస్, నర్సింహులు చీఫ్ ఆఫీసియల్స్ గా, రిఫరీలుగా వ్యవహారించారు.