మెదక్ ఎస్పీగా బాలస్వామి బాధ్యతలు

మెదక్ ఎస్పీగా బాలస్వామి బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నూతన ఎస్.పిగా డాక్టర్ బి.బాలస్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అదనపు ఎస్.పి ఎస్.మహేందర్ పుష్ప గుచ్చం అందజేసి ఆహ్వానించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్.పి గా బాధ్యతలు చేయట్టారు. 2018 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన డాక్టర్ బి.బాలస్వామి కాగజ్ నగర్ లో ఇన్ఛార్జి ఎస్.డి.పి.ఓ గా పనిచేసి అక్కడ నుండి మెదక్ జిల్లా అదనపు ఎస్పి గా పనిచేశారు. ఇక్కడి నుండి రాచకొండ కమిషనరేట్ లో ఎస్.బి డి.సి.పిగా పని చేసి అక్కడ నుండి సౌత్ వెస్ట్ జోన్ హైదరబాద్ సిటి డి.సి.పిగా పనిచేసి ప్రస్తుతము మెదక్ జిల్లా ఎస్పిగా వచ్చారు.

ప్రజాసేవకు సిద్ధం

ప్రజల సేవ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని కొత్త ఎస్పీ డా. బాలస్వామి అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న నేరుగా కలవవచ్చన్నారు. అక్రమాలకు పాల్పడే వారు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా శాంతికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే ఉరుకునేది లేదన్నారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు.

ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం కలిగేలా విదులు నిర్వహించాలన్నారు. కొత్తగా వచ్చిన ఎస్పీని మెదక్, తూప్రాన్ డిఎస్పిలు ఫణీంద్ర, యాదగిరి రెడ్డి,డి.సి.ఆర్.బి డిఎస్పిశ్రీనివాస్ రెడ్డి,సైబర్ సెల్ డిఎస్పి సుభాష్ చంద్ర భోస్, ఏ.ఆర్ డిఎస్పి ఎస్‌ఆర్.రంగ నాయక్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలోని సిఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు ఏ.ఆర్ ఎస్.ఐలు డి.పి.ఓ సిబ్బంది కలిశారు.