బిఆర్ఎస్ పై వ్యతిరేకత నిండిపోయింది 

బిఆర్ఎస్ పై వ్యతిరేకత నిండిపోయింది 
  •  కేటీఆరే వచ్చినా "శంకర్" గెలుపును ఆపలేరు 
  •  కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి 

ముద్ర, షాద్‌నగర్:- షాద్ నగర్ నియోజకవర్గానికీ కేటీఆరే  వచ్చినా వీర్లపల్లి శంకర్ గెలుపును ఎవరూ ఆపలేరని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని పేర్కొన్నారు.ఆదివారం నందిగామ మండలం చేగూర్ లో ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ వచ్చినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల నాటికి ఖాళీ కావడం ఖాయమని అన్నారు. శంకర్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. పదేళ్లపాటు పాలకులు కొనసాగించిన అన్యాయాలు అక్రమాలను ప్రజలు ఎండగట్టడం ఖాయమని హెచ్చరించారు.రాష్ట్రంలో నిరుపేదలు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక చేయూతను అందించేందుకు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో బీఆర్ఎస్ పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. ఆరు గ్యారెంటీల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ ప్రచారం చేపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, గురు రాజారావు తదితరులు గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన విభాగాల నాయకులు హాజరయ్యారు.