దయా వెబ్ సిరీస్ ట్రైలర్ 

దయా వెబ్ సిరీస్ ట్రైలర్ 

ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను తెలుగు వారికి అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తీసుకొస్తున్న మరో యూనిక్ వెబ్ సిరీస్ దయా. పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్,  ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. దయా వెబ్ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్  ను దర్శకుడు కృష్ణవంశీ విడుదల  చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ - దయా వెబ్ సిరీస్ ట్రైలర్ బాగుంది. ఈ సిరీస్ లోని బ్యాక్ గ్రౌండ్స్, ఎడిటింగ్ ప్యాట్రన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. పవన్ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. చక్రికి చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ క్యారెక్టర్ దొరికింది. ఈషా, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి  అన్నారు. హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ - గులాబీ సినిమాతో నన్ను హీరోగా చేసిన కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి రావాలని నా కోరిక. అలాగే వచ్చాడు. నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. పవన్ ను కలిసినప్పుడు డైరెక్టర్ గా అతనిలో ఒక ప్రామిసింగ్ క్వాలిటీ కనిపించింది. ఫొటో షూట్ దగ్గర నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను షూటింగ్ చేశాడు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్బ్ గా ఉంటుంది. కమల్,  విష్ణు ప్రియ క్యారెక్టర్స్ సర్ ప్రైజ్ చేస్తాయి. జోష్ రవికి మంచి క్యారెక్టర్ ఉంది.  వెబ్ సిరీస్ బాగుంటుంది చూడండి అని మేము పదే పదే చెప్పనక్కర్లేదు. మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా చూస్తారు. అని అన్నారు. హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ - డైరెక్టర్ పవన్ నాకు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా కథ చెప్పారు. నేను ఈ సినిమాలో నటించడం ఎందుకో కుదరలేదు. అయినా మేము కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకునేవాళ్లం. ఈ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది.