యాదవ విద్యావంతుల మండల అధ్యక్షులుగా వనగంటి వెంకటేష్ యాదవ్

యాదవ విద్యావంతుల మండల అధ్యక్షులుగా వనగంటి వెంకటేష్ యాదవ్

వలిగొండ ముద్ర న్యూస్: వలిగొండ మండల కేంద్రానికి చెందిన వనగంటి వెంకటేష్ యాదవ్ విద్యావంతులు ఐక్యవేదిక వలిగొండ మండల అధ్యక్షుడుగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం నూతనంగా ఎన్నికైన వనగంటి వెంకటేష్ యాదవ్ కి నియామక పత్రం అందించి అనంతరం సన్మానించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ యాదవ విద్యార్థుల సంక్షేమం కోసం అందరిని ఐక్యం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వనగంటి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకటేష్ యాదవ్, గుండెబోయిన అయోధ్య యాదవ్ కు, ఆనంద్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.