మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది -  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా 

మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది -  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో  నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, నేటి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అని తెలిపారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి వంటివి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆధారిత కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నదని అన్నారు. మహిళలు పొదుపు ఎక్కవగా చేస్తారని, నిరంతరం మహిళలు ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

శాశ్వతంగా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం మహిళా స్వయం సంఘాలకు రుణాలను అందిస్తున్నదని తెలిపారు. మహిళలు లేకుండా సమాజం లేదని, మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇన్వెష్ట్ చేయాలని అన్నారు. సామాజికంగా, నైతిక బాధ్యతతో మహిళలు పనిచేస్తున్నారని వివరించారు. నేటి సమాజంలో ఆడపిల్లలతో ఎలా మెలగాలో ఇంటి నుండే మగ పిల్లలకు పోషకులు తెలియజేయాలని అన్నారు.

జగిత్యాల శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం బాలకల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, మహిలాభ్యదయం కోసం సఖీ కేంద్రాలను నెలకొల్పి బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నా యని తెలిపారు. కోరుట్ల శాసన సభ్యులు డా. కే.సంజయ్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని, మహిళలు జీవిత దాతలు అని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, మగవారితో ధీటుగా మహిళలు రాణిస్తున్నరని తెలిపారు. మునిసిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతీ మాట్లాడుతూ, మహిళా ఓర్పు, సహనం కలిగి ఉంటుందని, మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు.

 
అనంతరం కలెక్టర్, జడ్పీటిసి, మునిసిపల్ చైర్ పర్సన్, జిల్లా అధికారిణి లు, పలు శాఖలలోని 130 మహిళా ఉద్యోగినులను ప్రశంసా పత్రం, మెమొంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలోజడ్పీటిసి అశ్విని, జిల్లా సంక్షేమ అధికారిణి వాణి, వివిధ శాఖలలో మహిళా ఉద్యోగినీలు, తదితరులు పాల్గొన్నారు.