మున్సిపల్ లో ఘనంగా  ఉగాది వేడుకలు ...

మున్సిపల్ లో ఘనంగా  ఉగాది వేడుకలు ...

పంచాంగ శ్రణం చేసిన శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌసిక...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ సమావేశ మందిరంలో  ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక పంచాంగ శ్రవణం చేసి రాశి పలాల ఫలితాలను వివరించారు. మున్సిపల్ అధ్వర్యంలో వేద బ్రాహ్మణులకు సన్మానం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆహుతులకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ నరేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణి రాధిక, కౌన్సిలర్లు, అధికారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.