ప్రజా పాలన అమలుకు ప్రత్యేక అధికారులు  - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ప్రజా పాలన అమలుకు ప్రత్యేక అధికారులు   - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో ప్రజా పాలన పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా, నియోజక వర్గం, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నిర్యమించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజా పాలన జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించామని తెలిపారు. అలాగే కోరుట్ల నియోజక వర్గానికి కోరుట్ల ఆర్డీఓ ఎస్.రాజేశ్వర్, జగిత్యాల నియోజక వర్గానికి జగిత్యాల ఆర్డీఓ కే.నరసింహ మూర్తి, ధర్మపురి నియోజక వర్గానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే. లక్ష్మి నారాయణ, చొప్పదండి నియోజక వర్గ పరిధి మండలాలకు  జీ.శ్రీనివాస్ రావ్, వేములవాడ నియోజక వర్గానికి మెట్ పల్లి ఆర్డీఓ డి.మధు లను ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు.  అలాగే జిల్లా లోని 18 మండలాలకు ఆయా తహశీల్దార్,మండల అభివృద్ధి అధికారులతో పాటు  ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు.

బీర్పూర్ మండలానికి ఏ డీ ఏ సి.సుధీర్, బుగ్గారం మండలానికి  జిల్లా మార్కెటింగ్ అధికారి డి. ప్రకాష్, ధర్మపురికి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఎండీ అబ్దుల్ రెహమాన్ , గొల్లపల్లికి  డి బి సీ డి ఓ ఎల్.సాయిబాబా, ఇబ్రహీం పట్నంకి  జడ్పీ డిప్యూటి సి ఇ ఓ రఘువరన్, జగిత్యాల గ్రామీణ మండలానికి ఇరిగేషన్ ఈఈ అఫ్జల్ హుస్సేన్ ఖాన్ , జగిత్యాల అర్బన్ మండలానికి  డీ యస్ సి డి ఓ కే.రాజ్ కుమార్, కతలాపూర్ మండలానికి జిల్లా అటవీ అధికారి  బి.వెంకటేశ్వర రావు , కొడిమ్యాల్ మండలానికి డి హెచ్ ఎస్ ఓ జే.ప్రతాప్ సింగ్, కోరుట్ల మండలానికి  రోడ్లు భవనాలు శాఖ ఇఇ ఎం.శ్రీనివాస్ , మల్లాపూర్ మండలానికి  డి అర్ డి ఓ పి.నరేష్ , మల్యాల మండలానికి   జిల్లా వ్యవసాయ అధికారి పి.సురేష్, మేడిపల్లి, భీమారం మండలాలకు జిల్లా సహకార అధికారి ఎం.సత్యనారాయణ , మెట్ పల్లి మండలానికి జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ , పెగడపల్లి మండలానికి డి వి ఏ హెచ్ ఓ కే. వేంకటేశ్వర రావు, రాయికల్ మండలానికి  డి ఇ ఓ జగన్ మోహన్, సారంగాపూర్ మండలానికి పంచాయతీ రాజ్ డిప్యూటి ఇ ఇ మిలింద్ , వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి. నారాయణ  లను నియమించామని తెలిపారు. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీ లకు కూడా ప్రత్యేక అధికారులను నియమించామని,  జగిత్యాల మునిసిపాలిటీకి ఏడి డి వి ఏ హెచ్ ఓ బి.నరేష్, కోరుట్ల మున్సిపాలిటీకి మైనింగ్ ఏ డీ విజయ్ కుమార్, రాథోడ్  మెట్ పల్లి మున్సిపాలిటీకిమిషన్ భగీరథ డి.ఈఈ  ఏ. ప్రేమ్ కుమార్ , రాయికల్ మున్సిపాలిటీకి డీ అర్ డి ఓ అసిస్టెంట్ మేనేజర్,దేవేందర్ రెడ్డి,  ధర్మపురి మునిసిపాలిటికిమిషన్ భగీరథ  డిప్యూటీ ఈ ఈ సి. హెచ్. రోహిత్  లను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.