పకడ్బందీగా  ప్రజాపాలన సభలు - అదనపు కలెక్టర్ రమేష్

పకడ్బందీగా  ప్రజాపాలన సభలు - అదనపు కలెక్టర్ రమేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ పక్కడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రజాపాలనపై అధికారిలతో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సహ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

ప్రతి రోజు రెండు షిఫ్టులలో తహసీల్దార్, ఎంపిడిఓల బృందాలు గ్రామాలలో, పట్టణాల్లో రెండు బృందాలు వార్డుల్లో ప్రజాపాలన సభల నిర్వహిస్తారన్నారు.  రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ క్రింది వాటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత, అభయహస్తం పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ శైలేష్, డిఆర్డిఓ శ్రీనివాస్, డీపీఓ సాయిబాబా మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సూచనలు