సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్ రావు

సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్ రావు

పాలకీడు, ముద్ర:-సూర్యాపేట జిల్లాలోని అన్ని శాఖలను జిల్లాలో గల  60 మంది అధికారులతో ఆకస్మిక తనిఖీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు . గురువారం పాలకీడు మండలంలోని అంగన్వాడీలు,స్కూల్స్, జీ పి శానిటేషన్,ఎఫ్ పి షాప్స్,రేషన్ షాప్స్,మీసేవలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ డెలివర్ మెకానిజం ఎలా వుంది అనేది తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఫీల్డ్ లో అన్ని కార్యాలయాల సిబ్బంది హజరును తనిఖీ చేశారు. గైరా జరుకు చెప్పిన కారణాలను పరిశీలించి సరైనదాకాదా అని ఆరా తీశారు. పాలకీడు మండల కేంద్రం లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువును స్వయంగా చూశారు. పౌష్ఠిక ఆహారం సరిగా అందుతుందా అని ఆరా తీశారు . ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది సమక్షంలో పిల్లలను పద్యాలు, ఎక్కాలు కంటస్తం చేయించారు . నైట్ వాచర్ ను నియమిస్తామన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా సిబ్బంది హాజరు బాగా పెరిగిందన్నారు.తనిఖీ కి ముందే అధికారులకు మెసేజ్ వస్తుందన్నారు. గ్రామ స్థాయిలో సర్వీస్ గురించి ఆరా తీశారు. పి హెచ్ సి,పల్లె దవాఖాన లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీదేవి,ఎంపీడీఓ వెంకటాచారి, ఏ పి o రాజు,ఎంపిపి గోపాల్ నాయక్,ఇతర అధికారులు పాల్గొన్నారు.