నేను చనిపోయాక మీరు బాధపడొద్దు..

నేను చనిపోయాక మీరు బాధపడొద్దు..

ఐ మిస్ యూ అమ్మా నాన్న అన్న అంటూ లేఖ.. 

నేను చనిపోయాక మీరు బాధపడొద్దు మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు.. "ఐ మిస్ యు అమ్మ నాన్న అన్న".. అమ్మానాన్నను నువ్వే బాగా చూసుకోవాలి అన్నా అంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాసిన లేక పలువురి హృదయాలను కలిచివేస్తోంది.

ముఖ్యంగా అమ్మానాన్న అన్నపట్ల తనకున్న ప్రేమను పదేపదే లేఖలో ప్రస్తావిస్తూ మీరు బాధపడకూడదని తను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని చెప్పడం హృదయాలను తోడేస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి వద్ద దొరికిన ఆ లేఖను చూసినవారు కన్నీటి పర్యంతమవుతున్నారు.