అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిస్కరించాలి

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిస్కరించాలి
Anganwadi employees problems should be resolved immediately

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చేన్నూరి రమేష్ 

మహాదేవపూర్: రాష్ట్రంలోని పనిచేస్తున్న 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిస్కరించాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చేన్నూరి రమేష్ అన్నారు బుధవారం రోజున జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రములోని ఐసిడియస్ ప్రాజెక్ట్ ఆఫీసు ముందు దర్న చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలు గా ఐసిడియస్ లో చాలి చాలని జీతంతో పేద ప్రజలకు సేవలందిస్తున్నమని అని అయిన కనీస వేతనం  పెన్షన్ ఉద్యోగ భద్రత ఈ ఎస్ ఐ మరియు ఇతర బెన్ ఫిట్స్ కల్పించడం లేదని పక్క రాష్ట్రల లో  తమిళనాడు పాండిచ్చేరి అక్కడి ప్రభుత్వం అంగన్‌వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించారు అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రం లో హెల్త్ కార్డులు ఇచ్చారు.

అని పండుగ బోనస్ మరియు ఇతర  అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అని తెలంగాణ ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిస్కరించాలి అని తెలిపారు లేకుంటే 2 3 తేదీలలో కలెక్టరు ఆఫీసు ముందు అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె ఉంటుంది అని సిఐటియు అధ్యక్షురాలు సత్యవణి డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కార్యదర్శి జయప్రద సత్యవతి పద్మ బీమక్క జిల్లా ప్రధాన కార్యదర్శి శోభరాణి అంగన్‌వాడీ టీచర్ లు మరియు ఆయా లు అందరూ పాల్గొన్నవారు