సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం  కుంటి సాకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్ కి తరలించడానికి ప్రయత్నిస్తున్న  విధానాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దగ్ధం  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాకు  కేటాయించిన మెడికల్ కాలేజీని తరలించడం మానుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడలు అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మాజి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు జనగాం పాండు, అబ్బగాని వెంకట్, ఓం ప్రకాష్ గౌడ్, పెంట నితీష్, రహీం,శాగంటి నరసింహ, రాజశేఖర్ పాల్గొన్నారు.