సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

ముద్ర కోనరావుపేట: కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా, బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ అధ్యక్షుడు, గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ ను అక్రమంగా, అన్యాయంగా, అరెస్టు చేయడన్ని ఖండించారు. .

తెలంగాణ ప్రభుత్వం, చేతగానితనం వల్లే పేపర్లు లీకేజీ జరుగుతున్నయని,  లీకేజీకి బాధ్యత వహిస్తూ  సీఎం, కేసీఆర్ జీనామా చేయాలని, వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు, ఎంపిటిసి ఇస్తరి ప్రవీణ్ కుమార్, సురేష్, నాగరాజ్, మహేష్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.