గ్రూప్ 4 పరీక్షలకు పటిష్ట బందోబస్తు

గ్రూప్ 4 పరీక్షలకు పటిష్ట బందోబస్తు
  • కరీంనగర్ సీపీ ఎల్ సుబ్బరాయుడు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :జూలై 1 న జరుగనున్న గ్రూప్ 4 పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 154 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

54,019 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. రెండు విడతలుగా ఈ పరీక్ష కొనసాగనున్నది. ఉదయం 10నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తర్వాత మధ్యాహ్నం 2:30గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగనున్నది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 15నిమిషాల ముందుగా చేరుకోవాలి. ఉదయం 9:45గంటలకు తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు పరీక్షా కేంద్రాలలోని ప్రధాన గేట్లను మూసివేస్తారు. పరీక్ష సమయానికి 15నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష ముగిసేంతవరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల నుండి బయటకు అనుమతించడం జరుగదు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లతో పాటు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు. పరీక్షా కేంద్రాల్లోని ప్రధాన గేట్ల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.

144 సెక్షన్ అమలు

పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 అమల్లో ఉంటుందని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది జమకూడి ఉండకూడదని పేర్కొన్నారు. పరీక్ష జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. ఏదైనా అవసరం ఉన్నట్లైతే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్ లను పరీక్ష ముగిసేంతవరకు మూసి ఉంచాలని పేర్కొన్నారు.