లైబ్రెరీ మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక

లైబ్రెరీ మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ బిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి  నివాసం ఇందిరా భవన్ లో  జగిత్యాల జిల్లా మాజీ  గ్రంధాలయ చేర్మెన్ డా.  చంద్రశేఖర్ గౌడ్ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అబ్యర్ధి జీవన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోరుట్ల సభలో చంద్రశేకర్ గౌడ్ ను సియం రేవంత్ రెడ్డి పార్టి కండువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ముంజాల రఘువీర్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.