సూరారంలో విద్యుదాఘాతంతో రైతు మృతి....        

సూరారంలో విద్యుదాఘాతంతో రైతు మృతి....        

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై  అదే గ్రామానికి చెందిన చేల్పురి రాజేశం (53) అనే రైతు మంగళవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం  సూరారం గ్రామానికి చెందిన రాజేశం తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంట వేశాడు. కాగా అక్కడ అడవి పందుల బెడద ఎక్కువ ఉండడంతో వాటి నుంచి పంటను రక్షించేం దుకోసం మొక్కజొన్న పంట చుట్ట జే వైరు చుట్టి, కంచ లాగా అమర్చి, విద్యుత్ తీగతో కనెక్షన్ ఏర్పాటు చేశాడు. కాగా ఎప్పటిలాగే పంటకు సాగునీరు అందించేందుకోసం మంగళవారం ఉదయం 6 గంటలకు వెళ్లిన రాజేశం, ప్రమాద వశాస్తు విద్యుత్  తీగలకు తలిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.