యువత గంజాయి కి బానిస కావొద్దు - సారంగాపూర్ ఎస్సై మనోహర్ రావు

యువత గంజాయి కి బానిస కావొద్దు - సారంగాపూర్ ఎస్సై మనోహర్ రావు

సారంగాపూర్ ముద్ర:యువకులు గంజాయి వంటి వ్యసనాలకు బానిస కావద్దని సారంగాపూర్ ఎస్సై మనోహర్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు యువత మేలుకో గంజాయి మానుకో కార్యక్రమం పై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు. అలాగే ఎవరి ఫోన్ అయినా పోగొట్టుకున్నట్లయితే 1903 నంబర్ కి కాల్ చేయాలని లేదా ceir నమోదు చేయడం ద్వారా తిరిగి ఫోను పొందవచ్చునని అన్నారు. అలాగే సామాజిక మాధ్యమమైన వాట్సాప్ ఫేస్బుక్ లలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్ట్లు పెడితే గ్రూప్ అడ్మిన్ తో పాటు పోస్ట్ చేసిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడునని అన్నారు. యువకులు అనవసరమైన గొడవలలో ఇన్వాల్వ్ కావద్దని ఎవరిపైన నైనా మూడు కేసులు నమోదైనట్లయితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయబడునని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, భూక్య సంతోష్ నాయక్, ఎంపీటీసీ మమత, సారంగాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్ఈడి నరసింహారెడ్డి,యువకులు పాంపర్తి రంజిత్, మరికంటి మల్లేశం, కల శేఖర్ ఉన్నారు.