అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సహాయం

ముద్ర.వీపనగండ్ల:-ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మిత్రుడికి తాము ఉన్నామంటూ ఆర్థిక సాయం అందజేసి చిన్ననాటి మిత్రులు మానవత్వం చాటుకున్నారు. వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన విగ్నేష్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని యువతకు కంప్యూటర్ విద్యను నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

గత కొన్ని రోజుల క్రితం కంప్యూటర్ సెంటర్ వద్ద మెట్ల ఏక్కుతూ జారి పడటంతో కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంటి వద్ద మంచానికి పరిమితమైన విగ్నేష్ పరిస్థితి తెలుసుకున్న 1999–2000 సంవత్సరం 10వ తరగతి మిత్రులు శుక్రవారం విగ్నేష్ ను పరామర్శించి తామున్నామంటూ మనోధైర్యం కల్పించి 53 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు సువర్ణ, పురేందర్ గౌడ్, నరేందర్, రాజు, కుర్మయ్య, రంజిత్, గంగులు ,నారాయణ, ప్రవీణ్, రాముడు, చిన్న రాముడు, గణపతి, వీరస్వామి, నరసింహ ఉన్నారు.