యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ఏ ఎన్ రెడ్డి కాలనీ యూనియన్ బ్యాంక్ శాఖలో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో  అగ్ని ప్రమాదం సంభవించింది. సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమై ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది అగ్ని మాపక యంత్రాలకి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన తరలివచ్చి మంటలు ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో కొన్ని డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది