విమానాల దారి మళ్లింపు

విమానాల దారి మళ్లింపు

పొగ మంచు కారణంగా హైదరాబాద్‌ కు రావలసిన పలు దేశీయ అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు.  ముంబై నుండి హైదరాబాదు రావాల్సిన ఇండిగో విమానం చెన్నైకి, దోహా నుండి రావలసిన ఇండిగో అంతర్జాతీయ విమానం ముంబైకి, చెన్నై నుండి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానం తిరిగి చెన్నైకి, ముంబై నుండి హైదరాబాద్‌ రావాల్సిన ఎయిర్‌ ఇండియా  విమానాన్ని అధికారులు చెన్నైకి మళ్లించారు. ) విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతుండడంతో శంషాబాద్‌ ఎయిర్పోర్టులో ప్రయాణికులు  పడి గాపులు కాస్తున్నారు.