ఇంగ్లిష్ అక్కరలేదంటున్న ఇటలీ

ఇంగ్లిష్ అక్కరలేదంటున్న ఇటలీ

పాశ్చాత్య దేశమైన ఇటలీ తాజాగా సంచలన  నిర్ణయం తీసుకుంది. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో అంగ్లభాషా వినియోగంపై నిషేధం విధించేందుకు యోచిస్తోంది. అంతేకాదు.. ఈ ఆదేశాలను ఉల్లంఘించేవారిపై ఏకంగా రూ.82 లక్షల(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సారథ్యంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌తో పాటూ అన్ని విదేశీ భాషలపై ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును సిద్ధం చేసింది.