ఫైర్ సర్వీసెస్ కు ఏపీ  సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్

ఫైర్ సర్వీసెస్ కు ఏపీ  సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్
Former Chief of AP CID Sunil Kumar

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించింది. ఇటీవల ఆయనకు డీజీగా ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం.. పోస్టింగ్ ఇవ్వకుండా, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత సునీల్ కుమార్ కు సీఐడీ చీఫ్ గా పదవిని కట్టబెట్టింది. ఆయన జగన్ కు వీరవిధేయుడిగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఎన్నోసార్లు విమర్శలు గుప్పించాయి.

ఈ క్రమంలో సునీల్ కుమార్ పై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ ను ఆదేశించింది. దీంతో, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది. ఇప్పుడు ఆయనకు ఫైర్ సర్వీసెస్ హెడ్ గా బాధ్యతలను అప్పగించింది.