మాతృసంస్థలకు పంపించాలంటూ డిప్యుటేషన్ అధికారుల దరఖాస్తులు

మాతృసంస్థలకు పంపించాలంటూ డిప్యుటేషన్ అధికారుల దరఖాస్తులు
  • సెలవులను సైతం మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ నిర్ణయం

ముద్ర, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెప్యుటేషన్లపై వివిధ శాఖలలో నియమితులైన అధికారులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు తమను వెంటనే రిలీవ్ చేసి మాతృసంస్థలకు పంపించాలని కోరుతున్నారు. ఇప్పటికే సిఐడి చీఫ్ సంజయ్, టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఏపీఎస్ఎఫ్ ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి  తదితర మొదలగు అధికారులు ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని కోరుతున్నారు. అయితే, ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్ కు సెలవు మంజూరు చేస్తూ, విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చిన ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత తీవ్రంగా వ్యతిరేకించిన విషయం విదితమే. దీంతో ఆయన సెలవును రద్దు చేశారు. ఇప్పటికే బదిలీకి దరఖాస్తు చేసుకున్న డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అధికారులెవ్వరికీ కూడా సెలవులు ఇవ్వకూడదని కూడా నిర్ణయం జరిగినట్టుగా సమాచారం.

 తమను మాతృసంస్థలకు పంపించాలంటూ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్న అధికారులను వివరాలను పరిశీలిస్తే..  స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ తనను మాతృసంస్థకు పంపించాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తనను ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ కు దరఖాస్తు చేసిన గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి.తక్షణం బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా విన్నవించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. ఈయన తన పదవికి రాజీనామా చేశారు.  తన మాతృ శాఖకు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ ను కోరిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి. ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్న ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డిపరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి. గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన టీడీపీ. తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్.

రావత్ తో పాటు తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు. ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. ధర్మారెడ్డి సెలవును తిరస్కరించిన ప్రభుత్వం. ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను వెనక్కు తీసుకున్న సీఐడీ చీఫ్ సంజయ్.

సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ సీఎస్ కు రాజీనామా లేఖ పంపించారు. త్వరితగతిన తన రాజీనామా ఆమోదించి తనకు రిలీవ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు.