టీటీడీ సిబ్బంది వైఫల్యం

టీటీడీ సిబ్బంది వైఫల్యం
Drones over Srivari Temple

తిరుమల: శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ తిరుగుతుంటే భద్రత సిబ్బంది ఏంచేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. యాంటీ డ్రోన్ సిస్టంను టీటీడీ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేసారు. డిఆర్డివో అధికారులతో ఏడాది క్రితం యాంటీ డ్రోన్ సిస్టంపై చర్చలు జరిపిన దాని అమలులో జాప్యం అయిందన్నారు. వెంటనే డిఆర్డివో అధికారులతో చర్చ జరిపి టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి యాంటీ డ్రోన్ సిస్టం అమలు చేయాలనీ కోరారు. ఐఐటి నిపుణులు తెలిపిన విధంగా తిరుమలలో జాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆ విషయంలో అజాగ్రత్త వహిస్తే జోషిమట్ పరిస్థితి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. భవిషత్ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవినీతికి పాటుపడినట్లే తిరుమలలో కొందరు పాలకమండలి సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిఎల ద్వారా సేవ టిక్కెట్లు., గదులను అధిక ధరకు విక్రయిస్తున్నారని భక్తుల వద్ద నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.