కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

400 మందికి వైద్య సేవలు అందించిన శ్రీ రామానుజ సేవా ట్రస్ట్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలో శనివారంనాడు శ్రీరామానుజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 400 మంది గ్రామస్తులు వైద్య శిబిరానికి వచ్చి వివిధ పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు. పలువురు సీనియర్ వైద్యులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ట్రస్ట్ వైస్- చైర్మన్ డాక్టర్ గోవర్ధన్ కౌశల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాలలో ఇది 36వదని చెప్పారు. వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ కు, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.