వేములవాడ లో ఐదవ సారి కూడా విజయం మనదే..

వేములవాడ లో ఐదవ సారి కూడా విజయం మనదే..
  • ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు..
  • 380 కోట్లతో చందుర్తి మండలాభివృద్ది..
  • చందుర్తి మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం..

ముద్ర,చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో సనుగుల గ్రామంలోని గోవిందరాజుల గుట్ట వద్ద చందుర్తి మండల భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు,నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది..ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మూడవసారి ముఖ్యమైనటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి దృఢ నిశ్చయంతో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చేసుకోని మిగిలిన అన్ని సమస్యలను తీర్చుకుందామని అన్నారు.ఈ రాష్ట్ర,మన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే బిఆర్ఎస్ పార్టీ గెలవాలని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అన్నారు. కార్మికుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్.టి.సి సంస్థను ప్రభుత్వం లో విలీనం చేసి 48వేల కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది మాత్రమే అని అన్నారు. 

మన పార్టీ ఆదేశానుసారం మన నియోజకవర్గంలో ప్రతీ 100మందికి బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇది మూడు వారాల్లో పూర్తి చేయాలని మండల కమిటీ లకు, గ్రామ కమిటీలను కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వర్యులు కేటీ.రామారావు నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాలలో ఊహించని అభివృద్ధి జరిగిందని, చందుర్తి మండలం అత్యంత కరువు ప్రాంతం అలాంటిది ఇప్పుడు 2018 నుండి మన చెరువుల అడుగు ప్రాంతం కనిపించే పరిస్థితి లేదు అంటే అభివృద్ధి కి నిదర్శనం అని అన్నారు. ఇప్పటి వరకు దళితబంధు 100 యూనిట్లు, పది కోట్లు మంజూరు అయితే పారదర్శకంగా 100 యూనిట్లు నిరుపెదలైన దళిత బిడ్డలకు అందించామని అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 1100 యూనిట్లు110 కోట్ల రూపాయల విలువైనటువంటి దళిత బంధు మాంజూరు చేశారని అన్నారు. ప్రతి చోట కూడా పార్టీ ముద్ర ఉండాలి. 

పార్టీ ముద్ర అంటే నిజమైన పేదలకు సేవ చేయడం, పార్టీ ముద్ర అంటే పారదర్శంగా చేయడం, పార్టీ ముద్ర అంటే బడుగు బలహీన వర్గాలు పేదవర్గాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం బిఆర్ఎస్ పార్టీ ముద్ర కనుక నిస్వార్థంగా ప్రజలకు సేవచేద్దాం అన్నారు. మరొక ప్రధానమైన అంశం రుణమాఫీ ప్రారంభమైనదని త్వరలోనే అందరికీ రుణమాఫీ జరుగుతుందని అన్నారు.రానున్న వంద రోజులు మనకు కీలకం అని ఇప్పుడే పార్టీ యంత్రాంగం కీలకంగా వుండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు,సర్పంచులు,ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.